అందరిని ప్రేమతో పలకరించు
మరల ఈ దారిన వస్తావో రావో
అందాలను మనసుతో తిలకించు
మరల ఈ దారిన వస్తావో రావో
ఉపదేశాలు ఎందుకులే ఆకలితో ఉన్న కడుపుకు
చేయూతను ఇపుడే అందించు
మరల ఈ దారిన వస్తావో రావో
ముడునాల్ల జీవితాన చిక్కు ముడులు ఎవరి కొరకు?
ద్వేషించే వారినైనా దీవించు
మరల ఈ దారిన వస్తావో రావో
Wednesday, June 9, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment